నోరూరించే 'గోల్డెన్' ఐస్‌క్రీమ్.. ధర రూ.1000.. ఎక్కడో తెలుసా? - golden foil ice cream
🎬 Watch Now: Feature Video
మండే ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు మనం చల్లగా ఏదైనా తినేందుకు ఆలోచిస్తుంటాం. చల్లగా ఫ్రూట్ జ్యూస్ లేదా మజ్జిగ తాగాలనుకుంటాం. ముఖ్యంగా ఈ సీజన్లో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ప్రత్యేకంగా ఐస్‌క్రీమ్‌ను తింటూ కనిపిస్తుంటారు. దుకాణదారులు సైతం కస్టమర్స్‌ను ఆకర్షించేందుకు వివిధ రకాల ఫ్లేవర్స్‌తో ఐస్‌క్రీమ్‌ను తయారు చేసి అమ్ముతుంటారు. సాధారణంగా ఒక ఐస్‌క్రీమ్ ధర రూ.5 నుంచి రూ. 200 వరకు ఉండచ్చని మనం అనుకుంటాం. కానీ గుజరాత్‌లోని ఓ షాపులో మాత్రం ఏకంగా రూ.1000 విలువగల ఐస్‌క్రీమ్‌ను అమ్ముతున్నారు.
ఆ ఐస్‌క్రీమ్ ధర తెలిసి మీరు ఆశ్చర్యపోయినప్పటికీ దీనికి ఓ ప్రత్యేకత ఉంది. చూసేందుకు సాధారణ ఐస్‌క్రీమ్‌లా కనిపిస్తున్నా దానిపై 24 క్యారెట్ల నిజమైన బంగారాన్ని పూతలా పూసి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు. గోల్డ్ ఫాయిల్ కవరింగ్‌తో పాటు అందులో వేసే టాపింగ్స్‌లో ఓ గోల్డ్ చాక్లెట్ బాల్‌ను కూడా వేస్తున్నారు. నోరూరించే ఈ ఐస్‌క్రీమ్‌లో వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌తో పాటు చోకో సిరప్‌ను కూడా వేస్తారట. ఇక ఈ గోల్డెన్ ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసినప్పుడు 18% జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుందట. కానీ హోం డెలివరీ సదుపాయం లేనందున మీరు ఈ ఐస్‌క్రీమ్‌ను తినాలంటే ఈ షాప్‌నకు వెళ్లాల్సిందే!