బాలికతో యువకుడి అసభ్య ప్రవర్తన.. చితకబాదిన కుటుంబసభ్యులు - Telangana latest crime news
🎬 Watch Now: Feature Video
మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా కామాంధుల చేతిలో బలవుతున్నారు. తాజాగా ఓ యువకుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండలో ఓ యువకుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు యువకుడిని చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సార్‌నగర్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్‌లోనూ ఇలాంటిదే ఓ ఘటన వెలుగు చూసింది. ఆంటోని అనే వ్యక్తి మహిళలు స్నానం చేస్తుండగా.. దొంగచాటుగా తన సెల్ఫోన్లో వీడియోలు చిత్రీకరిస్తుండగా.. గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు.