శబరిమల భక్తుల కోసం 300 అడుగుల బావిలో యోగా- నీటిలో తేలుతూ ఆసనాలు
🎬 Watch Now: Feature Video
Published : Dec 13, 2023, 3:12 PM IST
A Man 2 Hours Yoga In Well For Sabarimala Pilgrims Viral Video : శబరిమల యాత్రికులు క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్లాలని ఆకాంక్షిస్తూ తమిళనాడులోని తేని జిల్లాలోని చిన్నమనూరుకు చెందిన విజయన్ అనే ఆధ్యాత్మికవేత్త 300 అడుగుల లోతైన బావిలో నీటిలో తేలుతూ దాదాపు 2గంటలపాటు యోగా చేశారు. భక్తులు సురక్షితంగా శబరిమల నుంచి ఇంటికి తిరిగిరావాలని ప్రార్థించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ప్రస్తుతం శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ కావటం వల్ల పంబాకు వెళ్లేందుకు అనుమతిని నిరాకరించారు. ఫలితంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రోడ్లపై నిరసన చేపట్టారు. ఎరుమేలి- పంబా రోడ్డుపై అయ్యప్ప పాటలు పాడుతూ ఆందోళన నిర్వహించారు. కొంతమంది భక్తులు రద్దీలో చిక్కున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో స్వామిమాలలు వేసుకుని దీక్షలో ఉన్న భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శనం జరగాలని విజయన్ నీటిలో యోగా చేస్తూ ప్రార్థన చేశారు.