కారులో వచ్చి నడిరోడ్డుపై రూ. 81లక్షలు దోచుకెళ్లిన దొంగలు - 81లక్షల చోరి ఘటన రాజస్థాన్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16905871-thumbnail-3x2-gdfghdf.jpg)
రాజస్థాన్‌లో దొంగలు రెచ్చిపోయారు. కారులో వచ్చిన దొంగలు ధాన్యం వ్యాపారి రమేష్ గులేచా వద్ద రూ.81 లక్షలను దోచుకున్నారు. ఈ ఘటన ఫలోడి పట్టణంలో పట్టపగలే జరిగింది. స్కూటర్‌పై వెళ్తున్న వ్యాపారి వద్ద నుంచి నగదు బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. పట్టపగలే చోరీ జరుగుతున్నా ఎవరూ అడ్డుకోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST