కారు పార్కింగ్​ చేస్తుండగా ప్రమాదం.. 8 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి - కొయంబత్తూరు కారు ఢీకొట్టిన ఘటన

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 25, 2023, 4:08 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు ఢీ కొట్టగా 8 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కోయంబత్తూరు జిల్లాలోని వన్నారపేటలో జనవరి 18న జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు యజమాని సయ్యద్​ మహ్మద్​ను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు కారు పార్కింగ్​ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. సయ్యద్ ఇటీవలే కొత్త కారు కొనగా తన ఇంటి వద్ద దాన్ని పార్కింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో రైఫుద్దీన్​ బషీద్​ అనే 8ఏళ్ల బాలుడు అటుగా సైకిల్​పై వెళ్తున్నాడు. దీంతో బషీద్​ అక్కడే కొద్దిసేపు వేచి ఉన్నాడు. ఎంతకీ కారు పార్కింగ్ చేయడం పూర్తి కాకపోవడం వల్ల ఆ చిన్నారి సైకిల్​తో ముందుకు వెళ్లాడు. అయితే అదే సమయంలో కారు యజమాని.. బ్రేక్​కు బదులుగా యాక్సిలరేటర్​ను తొక్కాడు. దీంతో ఆ చిన్నారి.. కారు, ఎదురుగా ఉన్న గోడ మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.