60 dogs died after eating poison food : అమానుషం.. విషాహారం పెట్టి 60 శునకాలను చంపి.. ఆపై - తెలంగాణ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 8, 2023, 7:52 PM IST

60 dogs were killed by poisoned food in Yadadri : వీధి శునకాలకు విష ఆహారం పెట్టి చంపిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అర్రూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 60 వరకు శునకాలు మృతి చెందాయి. గ్రామ పరిధిలోని కొంత మంది వ్యక్తులు.. కుక్కలకు విష ఆహారం పెట్టారని స్థానికులు తెలిపారు. శునకాలు చనిపోయిన తర్వాత.. ట్రాక్టర్‌లో తీసుకెళ్లి ఊరి అవతల గోతి తీసి పాతి పెట్టినట్లు చెప్పారు.ఇదిలా ఉండగా.. వీధి శునకాలకు విష ఆహారం పెట్టి చంపడంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడద నియంత్రణకు ఇతర మార్గాల్లో ప్రయత్నించాలి గానీ.. ఇలా చంపడం సరికాదనే భావన వ్యక్తమవుతోంది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిందితులపై చర్యలు తీసుకుంటేనే.. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.