చీరకట్టులో 2వేల మంది మహిళల వాకథాన్ - మహిళల సారీ వాకథాన్​ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 18, 2023, 2:57 PM IST

ఫిట్​నెస్​కు చీరకట్టు అడ్డుకాదని నిరూపించేందుకు ఇన్నర్​వీల్ క్లబ్ తమిళనాడు తంజావూరులో 'సారీ వాకథాన్' అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. శనివారం జరిగిన ఈ వాకథాన్​లో 2,000 మంది మహిళలు చీర కట్టుకుని పాల్గొన్నారు. కలెక్టర్​ దినేశ్ పొన్​రాజ్ ఓలివర్ జెండా ఊపి సారీ వాకథాన్​ను ప్రారంభించారు. వయసుల వారీగా మహిళలు మూడు విభాగాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి విభాగంలో 18 నుంచి 35 సంవత్సరాలున్న మహిళలు 4 కిలోమీటర్ల దూరం నడిచారు. రెండవ విభాగంలో 36 నుంచి 59 సంవత్సరాలున్న మహిళలు 3 కిలోమీటర్ల దూరం నడిచారు. వృద్ధులు బృహదీశ్వరాలయం నుంచి ఒక కిలోమీటర్​ దూరం నడిచారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.