12 అడుగుల కింగ్ కోబ్రా కలకలం.. ఎక్కడంటే! - King cobra is booming in Srikakulam district

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 9, 2023, 3:51 PM IST

ప్రపంచంలోనే అతి విషపూరితమైన కింగ్ కోబ్రా శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది. సుమారు 12 అడుగుల పొడవున్న ఈ కింగ్ కోబ్రాను చూసి అక్కడి వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని సోంపేట మండలం జింకి భద్ర కాలనీలో ఓ ఇంటి వద్ద సుమారు 12 అడుగుల కింగ్ కోబ్రా దర్శనమిచ్చింది. అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందు శబ్దం రావడంతో లోపల ఉన్న వాళ్లు అంతా బయటకు వచ్చి చూసే సరికి అక్కడ పెద్ద పాము కనిపించింది. ఆ పామును చూసిన వారు భయభ్రాంతులతో పరుగులు తీశారు. భయపడిన స్థానికులు వెంటనే సోంపేటకు చెందిన పాములు పట్టే బాలయ్యకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న బాలయ్య చాకచక్యంగా పామును పట్టుకున్నారు. ఆ పాము సుమారు 12 అడుగులు పొడవు.. 10 కిలోల బరువు ఉందని బాలయ్య తెలిపారు. అ కింగ్ కోబ్రాను అటవీ శాఖ అధికారులకు అప్పగించడంతో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.