11 అడుగుల కింగ్ కోబ్రా.. హడలెత్తిపోయిన జనం - ఛత్తీస్గఢ్ అడవుల్లో కింగ్ కోబ్రా హల్చల్
🎬 Watch Now: Feature Video
ఛత్తీస్గఢ్ కోర్బాలో ఓ కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. పవన్ఖేట్ గ్రామంలోని ఓ వ్యక్తి ఇంటి పెరట్లో 11 అడుగుల పొడవున్న కోబ్రాను చూసి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ విషసర్పాన్ని చూసిన గ్రామస్థులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు జనాలను అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం జితేంద్ర సారథి నేతృత్వంలోని ఫారెస్ట్ టీమ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకుని సమీపంలోని అడవిలో వదిలేశారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం ఉదయం జరిగిందీ ఘటన.
"కింగ్ కోబ్రాను స్థానిక భాషలో పహార్ చిట్టి అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఈ తరహా కింగ్ కోబ్రా పొడవు 20 నుంచి 21 అడుగుల వరకు ఉంటుంది. ఈ జాతి కింగ్కోబ్రాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇవి ఆగ్నేయాసియా, భారత్లోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, పొడవైన పాములలో ఒకటి' అని ఫారెస్ట్ అధికారి జితేంద్ర సారథి తెలిపారు.