108 Veena Artists Performance In Madurai : ఒకేసారి 108 మంది వీణ వాయిస్తూ అమ్మవారికి స్వరాభిషేకం - వీణా సంగీత కార్యక్రమం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 10:39 AM IST

108 Veena Artists Performance In Madurai : తమిళనాడులోని మధురై మీనాక్షి ఆలయంలో ఘనంగా విజయదశమి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా.. మంగళవారం 108 మంది ఒకేసారి అమ్మవారి సన్నిధిలో వీణ వాయించారు. మధురై, నమక్కల్​, దిండిగల్​కు చెందిన కళాకారులు ఈ స్వరాభిషేకంలో భాగస్వాములు అయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు కూడా భారీగా సంఖ్యలో సంగీత కచేరీని చూసేందుకు తరలివచ్చారు.  

వీణా నాదంతోనే వినాయకుడి పాటలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సంగీత ప్రియులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వరాభిషేకం తర్వాత వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని పూజలు నిర్వహించారు భక్తులు. ప్రతి ఏడాది మధురై మీనాక్షి ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలు ఇలానే ఘనంగా జరుగుతాయి. 

Talwar Aarti In Harsiddhi Mata Temple : నవరాత్రుల్లో భాగంగా గుజరాత్​.. నర్మద జిల్లాలోని రాజ్​పిప్​లా పట్టణంలో వినూత్న పూజలు చేశారు భక్తులు. పట్టణంలో ఉన్న హర్​సిద్ధీ మాత ఆలయంలో ఖడ్గాలతో అమ్మవారికి హారతి సమర్పించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.