వెనిస్ నగరాన్ని ముంచెత్తిన వరద - Italy latest
🎬 Watch Now: Feature Video

అట్లాంటిక్‌లో సంభవించిన తుపాను.. ఇటలీలోని వెనిస్ నగరాన్ని ముంచెత్తింది. ఉత్తర ఇటలీలో బలమైన గాలులు, వర్షం కారణంగా సుమారు పావు వంతు వెనిస్.. వరద నీటిలో చిక్కుకుంది. లాగూన్‌లో నీటి మట్టం 116 సెంటీమీటర్ల(45.6 అంగుళాలు)కు చేరింది. లాగూన్‌లో ఒక్క జూన్ నెలలోనే అత్యధికంగా నీటిమట్టం నమోదు కావడం ఇది మూడోసారి. 2002లో అక్కడ రికార్డు స్థాయిలో 121 సెం.మీ.(47.6 అంగుళాలు) నీటిమట్టం నమోదైంది.