అంతా గద్దె దిగాల్సిందే- అల్జీరియన్ల నిరసనలు
🎬 Watch Now: Feature Video
అల్జీరియా ప్రజల నిరసనలు ఎనిమిదో వారానికి చేరాయి. తాత్కాలిక అధ్యక్షుడు అబ్దుల్కాదర్ బెన్సాలా వైదొలగాలంటూ వేలాది మంది రాజధాని అల్జీర్స్లో ఆందోళనలకు దిగారు. నిరసనకారులపైకి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, రబ్బరు బుల్లెట్లు కురిపించారు. నిరసనలకు తలొగ్గి ఏప్రిల్ 2న అబ్దెల్అజీజ్ బౌటేఫ్లికా అల్జీరియా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అయినా నిరసనకారులు ఇంకా చాలా మంది పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తాత్కాలిక అధ్యక్షుడి అవసరమూ తమకు లేదని గళమెత్తారు.