ధైర్యం కూడగట్టుకొని ట్రంప్ 'ర్యాంప్ వాక్'! - Trump West Point Graduation ceremony
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7613895-thumbnail-3x2-trump.jpg)
ఆయన రూటే సేపరేటు. ఆయన ఏం చేసినా అది ఓ వార్తే. ఆయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా ఆయన ర్యాంప్‌పై నడిచిన విధానం అందరినీ ఆకర్షించింది. ఇటీవల న్యూయార్క్ వెస్ట్‌పాయింట్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకలకు తొలిసారిగా ట్రంప్ హాజరయ్యారు. ప్రసంగం అనంతరం వేదికపై నుంచి దిగేందుకు ర్యాంప్ మార్గాన్ని ఎన్నుకొన్నారు. అయితే ఆ ర్యాంప్‌నకు ఇరువైపులా ఎలాంటి హ్యాండ్ సపోర్టూ లేదు. ఇది గమనించిన ట్రంప్.. ఎవరి సాయం లేకుండా నెమ్మదిగా, జాగ్రత్తగా దిగారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.