కన్వేయర్ బెల్టుపై చిన్నారి.. తప్పిన ప్రాణాపాయం - అమెరికా
🎬 Watch Now: Feature Video
బ్యాగ్‌లను తనిఖీ చేసే కన్వేయర్ బెల్ట్‌పై రెండేళ్ల చిన్నారి పడి యంత్రాలగుండా లోపలి వరకూ వెళ్లిపోయిన ఘటన అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయంలో చోటు చేసుకుంది. తల్లి బోర్డింగ్ పాస్ తీసుకుంటున్న క్రమంలో చిన్నారి ఆడుకుంటూ దానిపై ఎక్కాడు. బ్యాగులతో పాటు లోపలికి లాక్కెలుతున్న బెల్టుపై నుంచి బయటపడేందుకు చిన్నారి చేసిన ప్రయత్నం ఫలించలేదు. బెల్ట్‌పై తనిఖీల యంత్రాల గుండూ వెళుతూ.. చివరకు భద్రతా సిబ్బంది ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు. గమనించిన సిబ్బంది వెంటనే యంత్రాలను నిలిపేసి బాబును రక్షించారు. చిన్న గాయాలతో ప్రాణాపాయం తప్పించుకున్న బాబును చూసి.. అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.