వరదల్లో పారాగ్లైడర్ల సాహసం- ఆహారపొట్లాలతో ఎగురుకుంటూ వెళ్లి... - floods news
🎬 Watch Now: Feature Video
థాయిలాండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సుఖోథాయి రాష్ట్రంలో వందలాది గ్రామాలు నీటమునిగాయి. ప్రజలు అందులోనే చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో మానవత్వంతో వ్యవహరిస్తున్నారు పారాగ్లైడర్లు. ముంపు ప్రాంతాల వారికి ఆకాశం నుంచి ఆహారపొట్లాలు చేరవేస్తూ.. ఎంతోమందికి ఆకలి తీర్చుతున్నారు. కొద్దిరోజుల నుంచి అవిశ్రాంతంగా సేవచేస్తున్నారు. నూడుల్స్, వాటర్ బాటిళ్లు, బియ్యం, పండ్లు ఇతరత్రా అందిస్తున్నారు. భారీ వరదలతో రాజధాని బ్యాంకాక్‌కు కూడా ముప్పు పొంచి ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది సైన్యం. థాయిలాండ్ వ్యాప్తంగా మొత్తం 2 లక్షలకుపైగా ఇళ్లు నీటమునగగా.. ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. పలువురు గల్లంతయ్యారు.