పడిపోయిన బాలుడు.. అద్భుత క్యాచ్‌తో తప్పిన ప్రమాదం - కౌంటర్‌పై నుంచి కింద పడబోయిన చిన్నారి.
🎬 Watch Now: Feature Video

దుకాణంలోని కౌంటర్‌పై నుంచి నేల మీద పడబోయిన ఓ చిన్నారి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని ఉత్తాహ్ రాష్ట్రం హరికేన్ నగరంలో చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు పిల్లాడితో వచ్చి.. చిన్నారిని కౌంటర్‌పై కూర్చోబెట్టారు. ఇక వస్తువులను కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. పిల్లాడు దొర్లుకుంటూ కిందపడబోతుంటే ఆ స్టోర్ మేనేజర్ చూసి ఒక్క ఉదుటున చిన్నారిని పట్టుకున్నాడు. బాలుడిని దగ్గరకు తీసుకున్న తల్లి.. మేనేజర్‌కు కృతకజ్ఞతలు తెలిపింది. ఈ దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.