కరోనా భయాలు బేఖాతరు- పార్క్‌లు, బీచ్‌లలో జనం షికారు - New york Central park latest visuals
🎬 Watch Now: Feature Video
అమెరికాలో ఓ వైపు కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుంటే.. మరోవైపు సందర్శకులతో పార్కులు, పర్యటక ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. చాలా రోజులుగా ఇళ్లకే పరిమితమైన అమెరికన్లు వసంతకాలంలో విరబూసిన సుందర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. న్యూయార్క్‌లో వందలాది మంది పార్కులు, బీచ్‌ల బాట పట్టారు. కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేశారు. అయితే వీరందరూ మాస్కులు ధరించేలా, భౌతిక దూరంతో పాటు కరోనా సోకకుండా మిగతా జాగ్రత్తలు తీసుకునేలా 1000 మంది అధికారులు ఎల్లవేళలా పర్యవేక్షిస్తున్నారు.