హైవేపై ల్యాండ్ అయిన విమానం.. వీడియో వైరల్ - విమానం అత్యవసర ల్యాండింగ్
🎬 Watch Now: Feature Video
సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఓ చిన్న విమానాన్ని నడి రోడ్డుపైనే ల్యాండ్ చేసిన ఘటన అమెరికాలోని లూసియానాలో జరిగింది. విమానం 2వేల అడుగుల ఎత్తులో ఉండగా పైలట్.. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించాడు. తిరిగి విమానాశ్రయానికి వెళ్లే లోపు ప్రమాదం జరగవచ్చని గ్రహించి.. సమీపంలోని ఓ విశాలమైన జాతీయ రహదారిపై విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఓ వాహన ప్రయాణికుడు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.