వీరి విన్యాసాలకు ఫిదా అవ్వాల్సిందే..! - జర్మనీ
🎬 Watch Now: Feature Video
జర్మనీలో జరిగిన వరల్డ్ స్లాక్లైన్ మాస్టర్స్ టోర్నీలో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో అలరించారు పోటీదారులు. పలుచని తాడుపై వెనుకకు, ముందుకు, పైకి ఎగురుతూ.. పట్టు కోల్పోకుండా ప్రదర్శనలు చేసి వహ్వా అనిపించారు. జర్మనీలోని ష్టుట్గార్ట్ ఈ క్రీడకు వేదికైంది. చిలీకి చెందిన 32 ఏళ్ల అబ్రహం హెర్నాండెజ్ ట్రిపుల్ ఫ్లిప్ విభాగంలో టైటిల్ ఎగరేసుకుపోయాడు. జపాన్, ఫ్రాన్స్, బ్రెజిల్ ఇలా 14 దేశాల నుంచి 30 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.