విద్యార్థుల మధ్య గొడవ- బాల్కనీ నుంచి పడి ఏడుగురు మృతి - Seven students die in fall from 4th floor in Bolivia
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10863267-thumbnail-3x2-students.jpg)
బొలీవియా పెడ్రో డొమింగోమురిల్లో రాష్ట్రంలోని పబ్లిక్ యూనివర్శిటీ(యూపీఈఏ)లో 11 మంది విద్యార్థులు నాలుగో అంతస్తు నుంచి పడిపోయారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాల్కనీలో గుమిగుడిన విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఘర్షణ జరిగి.. రక్షణగా ఏర్పాటు చేసిన గ్రిల్స్ విరిగిపోయాయి. దీంతో 11 మంది కింద పడిపోయారు. కిందకు వేలాడుతూ ఉన్న ఓ విద్యార్థిని పైకిలాగి రక్షించారు.