నారింజ వర్ణం మంచును ఎప్పుడైనా చూశారా?
🎬 Watch Now: Feature Video
శీతల ఉష్ణోగ్రతల వల్ల అనేక ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. సాధారణంగా శ్వేత వర్ణంలో ఉండే హిమం చూపరులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే.. వాయవ్య ఇటలీలో ఇటీవల కురిసిన మంచు మాత్రం ఆరెంజ్ కలర్లో కనిపిస్తూ సందర్శకులను మరింత ఆశ్చర్యపరుస్తోంది. అక్కడి సహారా ఎడారి నుంచి గాల్లో కలిసిన ఎర్రటి ఇసుక రేణువులు ఇందులో కలవడం వల్లే.. అల్పైన్ ప్రాంతాల్లోని మంచు ఇలా లేత నారింజ వర్ణంలోకి మారినట్టు తెలుస్తోంది. చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న ఈ మంచు ప్రాంతంలో సందర్శకులు శునకాలను ఎడ్లబండిలా కట్టి స్కేటింగ్ చేస్తూ అలరించారు.