సముద్రంలో ఎగిసిపడిన మంటలు.. కారణమేంటి?

By

Published : Jul 3, 2021, 4:08 PM IST

Updated : Jul 3, 2021, 5:16 PM IST

thumbnail
మెక్సికోలో ఓ అండర్‌వాటర్ గ్యాస్​ పైప్‌లైన్‌ లీకై.. నడి సముద్రంలో మంటలు ఎగిసిపడ్డాయి. యుకాటన్ ద్వీపకల్పానికి పశ్చిమాన సముద్రపు ఉపరితలంపై ఈ ఘటన జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని ఆ రాష్ట్ర చమురు సంస్థ పెమెక్స్ తెలిపింది. నీటి అడుగున పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పెమెక్స్‌ వెల్లడించింది. పెమిక్స్‌ కంపెనీకి అతి సమీపంలో..ఈ ఘటన జరిగింది. ఈ పైప్‌లైన్‌ పెమిక్స్‌కు చెందిన అతి ముఖ్యమైన కుమలూబ్‌ జాప్‌ ఆయిల్‌ డెవలమెంట్‌ని పెమిక్స్‌ ప్లాట్‌ఫాంతో కలుపుతుంది.ఉదయం 5గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని ఇందులో ఎవరు గాయపడలేదని పెమెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. 5 గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పినట్లు తెలిపాయి.
Last Updated : Jul 3, 2021, 5:16 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.