చైనాకు వ్యతిరేకంగా కెనడాలో ఎన్ఆర్ఐల నిరసన - Canada NRI's protest against the China
🎬 Watch Now: Feature Video
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ హింసాత్మక ఘర్షణ నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కెనడాలోని చైనా రాయబార కార్యాలయం ముందు ప్రవాస భారతీయలు చైనాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. త్రివర్ణ పతకాలు, ప్లకార్డులు పట్టుకుని డ్రాగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైనికులపై దాడులు, చైనాలో యునిగర్ ముస్లింలపై దాడులు ఆపాలంటూ నినదించారు. ఇప్పటికే చైనా వస్తువులు బహిష్కరించాలనే ఉద్యమం దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా కొనసాగుతుండగా.. ఇప్పుడు విదేశాల్లోనూ అదేతరహా ఆందోళనలు జరుగుతున్నాయి.