దట్టంగా పేరుకుపోయిన మంచు- అమెరికన్ల ఇక్కట్లు
🎬 Watch Now: Feature Video
అమెరికాలో మంచు తుపానుతో ప్రజలు వణికిపోతున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. హిమపాతం కారణంగా.. జనజీవనం స్తంభించింది. రవాణా నిలిచిపోయింది. విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ల్లో పడిగాపులు కాస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లు మూతబడ్డాయి. మాన్హట్టన్ సెంట్రల్ పార్కులో 16 అంగుళాలు, న్యూజెర్సీలో 30 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. ప్రజలను బయటకు రావొద్దని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. పలు చోట్ల.. రోడ్లపై కూరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు సిబ్బంది. బుధవారం సాయంత్రం వరకు ఈ ప్రభావం కనిపిస్తుందని స్పష్టం చేశారు.