ఐఫిల్​ టవర్​ వద్ద అదిరే స్టంట్​- సన్నటి తాడుపై నడుస్తూ.. - ఐఫిల్​ టవర్​వద్ద తాడుపై నడక

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 19, 2021, 3:57 PM IST

ఫ్రాన్స్​ పారిస్​లోని ప్రఖ్యాత ఐఫిల్​ టవర్(Eiffel Tower)​ వద్ద ఓ వ్యక్తి.. శనివారం ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేశాడు. ఐఫిల్​ టవర్(Eiffel Tower)​ మొదటి అంతస్తు నుంచి ట్రోకాడెరో స్క్వేర్ ప్రాంతంలోని ఓ థియేటర్​ పైకప్పునకు కట్టిన సన్నటి తాడుపై నడిచాడు(Rope Walking) నాథన్​ పౌలిన్​ అనే రోప్​వాకర్​ ఆర్టిస్ట్​. 70 మీటర్ల ఎత్తున 2.5 సెంటిమీటర్ల మందం ఉన్న తాడుపై 600 మీటర్ల దూరం నడిచి.. అతడు ఈ సాహస యాత్ర(Rope Walking) పూర్తిచేశాడు. మధ్యమధ్యలో తాడుపై పలు స్టంట్స్ చేసి కూడా పౌలిన్ అలరించాడు. ఈ సాహసం పూర్తి చేయడం తనకు ఓ కలలా ఉందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడతడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.