హిమపాతంతో పదుల సంఖ్యలో ప్రమాదానికి గురైన కార్లు - జపాన్లో ప్రమాదానికి గురైన కార్లు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10302402-thumbnail-3x2-img.jpg)
జపాన్లోని మియాగిలో భారీగా కురుస్తోన్న హిమపాతంతో జనజీవనం స్తంభించిపోయింది. మంచు వల్ల రోడ్డు కనిపించక జాతీయ రహదారిపై పదుల సంఖ్యలో వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఒకదాని వెనక ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదానికి గురైన కార్లు, ఇతర వాహనాలను రహదారి మీదనుంచి తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.