బెజోస్​ రోదసి యాత్ర ఎన్ని కిలోమీటర్లు సాగిందంటే? - రోదసి యాత్ర జెఫ్​ బెజోస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 21, 2021, 4:56 PM IST

అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్ విజయవంతంగా రోదసి యాత్రను పూర్తి చేశారు. బెజోస్​ బృందంలో అతని సోదరుడు మార్క్​ బెజోస్​, ప్రముఖ మహిళా పైలట్​ వేలీ ఫంక్ (82), ఆలివర్‌ డేమన్‌ (18) ఉన్నారు. మంగళవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం).. పశ్చిమ టెక్సాస్​ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్ సైట్ వన్​ నుంచి బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ అంతరిక్ష నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వ్యోమనౌక మొత్తం 106 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయాణించింది. ​100 కిలోమీటర్ల ఎత్తులో బెజోస్ బృందం కొన్ని క్షణాల పాటు మైక్రోగ్రావిటీ స్థితిని అనుభవించినట్లు బ్లూ ఆరిజిన్ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.