బీరుట్ పోర్టులో మరో భారీ ప్రమాదం - బీరుట్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
లెబనాన్ రాజధాని బీరుట్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించి.. సుమారు 2 వందల మంది ప్రాణాలు కోల్పోయిన నెలరోజుల్లోనే అక్కడ మరో దుర్ఘటన జరిగింది. బీరుట్ ఓడరేవులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్నికీలలతో దట్టమైన పొగ అలుముకుంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగాయి. టైర్లు ఉండే గోదాములో చెలరేగిన మంటలు.. ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ఈ ప్రమాదానికి కచ్చిమైన కారణాలు తెలియరాలేదు. ఆగస్టు 4న జరిగిన మూడు వేల టన్నుల అమోనియం నైట్రేట్ పేలిన ఘటనలో 200 మంది చనిపోగా.. మరో 6,500 మంది గాయపడ్డారు. వేలాది భవనాలు దెబ్బతిన్నాయి.