ఇజ్రాయెల్‌ను ముంచెత్తిన వరదలు.. ఇద్దరు మృతి - floods news
🎬 Watch Now: Feature Video
ఇజ్రాయెల్ టెల్ అవీవ్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని ఓ భవనంలో పార్కింగ్ గ్యారేజ్‌లోకి వరద నీరు చేరి ఇద్దరు మృతి చెందారు. లిఫ్ట్‌లో కిందకు వెళ్లిన క్రమంలో వరద నీరు చేరి అందులోనే చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వర్షాలు మరో రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.