సెల్ఫీ గొరిల్లాలు.. సోషల్‌మీడియాలో సెలబ్రిటీలు - సోషల్ మీడియా ట్రెండింగ్
🎬 Watch Now: Feature Video
మనుషులంత తెలివైన మరో జంతువులు ఏవైనా ఉన్నాయా అంటే వెంటనే గుర్తొచ్చేవి గొరిల్లాలు. రెండు కాళ్లపై నిలబడటం, తినడం, ప్రేమగా పిల్లల్ని సాకడం చేస్తుంటాయి. తాజాగా 'రిపబ్లిక్ ఆఫ్ కాంగో'లోని విరుంగా జాతీయ పార్కులో రెండు గొరిల్లాలు నెట్టింట సెలబ్రిటీలుగా మారాయి. అందుకు కారణం ప్రస్తుతం అవి సెల్ఫీ ట్రెండ్‌ను పాటిస్తున్నాయి. పార్కులోని రేంజర్ అధికారులు సెల్ఫీ దిగుతుండగా.. గొరిల్లాలు కూడా వారి లాగే ఫోజిస్తూ సెల్ఫీ దిగాయి. ఈ చిత్రానికి సోషల్ మీడియాలో బాగా ఆదరణ లభించింది. ఈ రేంజర్ అధికారులు గొరిల్లాలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కాపాడారు. అప్పటి నుంచి ఆ గొరిల్లాలు వారిని అనుకరించడం, తల్లిదండ్రుల్లా భావించి ఆటలాడుకోవడం చేస్తుంటాయని సంరక్షకులు తెలిపారు.