ETV Bharat / international

భార్యపై 72 మంది అత్యాచారం- మాజీ భర్తకు 20 ఏళ్ల జైలుశిక్ష - FRENCH MASS RAPE CASE

భార్యకు మత్తుమందు ఇచ్చి పలువురితో అత్యాచారం చేయించిన భర్త- నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష వేసిన కోర్టు

French Mass Rape Case
French Mass Rape Case (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2024, 6:01 PM IST

French Mass Rape Case : ఫ్రాన్స్‌లో భార్యకు మత్తుమందు ఇచ్చి అనేక మందితో అత్యాచారం చేయించిన కేసులో అక్కడి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఫ్రాన్స్‌లో సంచలనం రేపిన ఈ సామూహిక అత్యాచార కేసులో బాధితురాలి మాజీ భర్త డొమినిక్‌ పెలికాట్‌ను అవిగ్నాన్‌ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా డొమినిక్‌ను నేరస్థుడిగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రపంచం తలదించుకునేలా ఓ మహిళపై పాశవికంగా ప్రవర్తించిన డొమినిక్‌కు 20 ఏళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.

కోర్టు వద్దకు భారీగా ప్రజలు, సామాజిక కార్యకర్తలు
తాజా తీర్పుతో 72 ఏళ్ల డొమినిక్‌ దాదాపు అతడు మరణించే వరకు జైల్లోనే గడిపే అవకాశముంది. అటు కేసులోని మిగతా 51 మంది నిందితులకు నాలుగేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు కోర్టు శిక్ష విధించింది. ఈ తీర్పును వినేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, సామాజిక కార్యకర్తలు అవిగ్నాన్‌ కోర్టు వద్దకు చేరుకున్నారు. నిందితుడికి శిక్ష ఖరారు చేయగానే సంబరాలు చేసుకున్నారు. బాధితురాలికి మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని కోర్టు బయట నినాదాలు చేశారు.

అసలేం జరిగిందంటే?
ఫ్రాన్స్​లోని ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి అయిన డొమినిక్‌ పెలికాట్‌ తన భార్యపట్ల కొన్నేళ్ల పాటు అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. రాత్రి పూట ఆహారంలో రహస్యంగా డ్రగ్స్‌ కలిపి తినిపించేవాడు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఇంటికి కొందరు వ్యక్తుల్ని రప్పించేవాడు. వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతుంటే, రహస్య కెమెరాల్లో రికార్డు చేసి వికృత ఆనందాన్ని పొందేవాడు. ఇలా దాదాపు పదేళ్లపాటు ఆమెపై అకృత్యాలు సాగించాడు. 2011 నుంచి 2020 మధ్య ఈ దారుణాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

దొరికిపోయాడిలా!
2020లో ఓ షాపింగ్‌ సెంటర్‌లో డొమినిక్‌ కొందరు మహిళలను రహస్యంగా వీడియో తీస్తుండటాన్ని అక్కడి సెక్యూరిటీ గార్డు గుర్తించి పట్టుకున్నాడు. అనంతరం పోలీసు విచారణలో అతడి ఫోన్‌, కంప్యూటర్‌ను తనిఖీ చేయగా భార్యపై అతడి అకృత్యాలు బయటపడ్డాయి. ఆమెపై పరాయి వ్యక్తులు లైంగిక దాడులకు పాల్పడిన వందలకొద్దీ ఫొటోలు, వీడియోలను పోలీసులు గుర్తించారు. డొమినిక్‌ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలియడం వల్ల అతడి నుంచి విడిపోయిన బాధితురాలు కోర్టును ఆశ్రయించారు.

72 మంది 92 సార్లు రేప్
2011 నుంచి 2020 మధ్య మొత్తం 72 మంది 92 సార్లు బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దురాగతాలకు పాల్పడిన వారి వయసు 26 నుంచి 73 ఏళ్ల మధ్యలో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. వీరిలో 51 మందిని గుర్తించగా, మిగిలిన వారి ఆచూకీ లభించలేదు.

నేరం ఒప్పుకున్న నిందితుడు
విచారణలో భాగంగా ఇటీవల డొమినిక్‌ను కోర్టులో హాజరుపరచగా తనపై మోపిన ఆరోపణలను అంగీకరించాడు. ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా 50 మందిని ప్రస్తావిస్తూ వారిలాగే తాను రేపిస్ట్‌నని తెలిపాడు. ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం వీడియో ఆధారాలను కూడా పరిశీలించి తాజాగా డొమినిక్‌ను దోషిగా తేల్చింది.

కోర్టు తీర్పుపై అసహనం
అయితే కోర్టు తీర్పుపై కొందరు మహిళలు, సామాజిక కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కోర్టు విధించిన శిక్షలు తమను నిరాశకు గురిచేశాయని, చారిత్రక తీర్పు వస్తుందని ఆశించినట్లు కొందరు అంసతృప్తి వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.