How To Make Money on YouTube : ట్యాలెంట్ ఉన్నవారికి యూట్యూబ్ మంచి ఉపాధి అవకాశాలు కలిగిస్తోంది. ఒక్క వీడియోలు క్లిక్ అయితే ఓవర్ నైట్ స్టార్లను చేసేస్తుంది. భారత్‌లో చాలా మంది యూట్యూబ్ ద్వారా రూ.లక్షలు సంపాదిస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఓ మహిళకు యూట్యూబ్ వల్ల చేదు అనుభవం ఎదురైంది. యూట్యూట్ వీడియోలు చేయడానికి రూ.8 లక్షలు ఖర్చు చేసింది. దాదాపు 250 వీడియోలు అప్లోడ్ చేసింది. అయితే, ఆమెకు మిగిలింది మాత్రం సున్నా. మీరు విన్నది నిజమే ఆమెకు వచ్చిన ఆదాయం అక్షరాలా రూ.0. అసలు యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదించొచ్చు? ఆ మహిళకు ఎందుకు ఇలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
నళిని- నీకే ఎందుకిలా?
నళిని ఉనాగర్ మహిళ దాదాపు మూడేళ్లుగా యూట్యూబ్‌లో 'నళినీస్ కిచెన్ రెసిపీ' అనే ఛానల్ నడుపుతోంది. కానీ ఇటీవల యూట్యూట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పింది. ఇంతకాలం ప్రయత్నించినా ఆదాయం రాకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుంది. ఈ మేరకు ఎక్స్‌లో పలు పోస్టు చేసింది. అందులో "నేను నా యూట్యూబ్ కెరీర్లో ఫెయిల్ అయ్యాను. అందుకే నా కిచెన్ వస్తువులు, స్టూడియో ఎక్విప్మెంట్ అమ్మేస్తున్నాను. స్టూడియో, కిచెన్ సెటప్ ఏర్పాటు చేయడానికి, ప్రమోషన్స్‌కు రూ.8 లక్షల వరకు ఖర్చు చేశాను. కానీ నాకు వచ్చింది రూ.0. " అని నళిని తెలిపింది.
I failed in my YouTube career, so I’m selling all my kitchen accessories and studio equipment. If anyone is interested in buying, please let me know. 😭 pic.twitter.com/3ew6opJjpL
— Nalini Unagar (@NalinisKitchen) December 18, 2024
'యూట్యూబ్ కొందరికే ఫేవర్ చేస్తోంది'
గత మూడేళ్లుగా 250 వీడియోలు చేసి 2,450 సబ్‌స్కైబర్లను సంపాదించింది నళిని. అయితే తాను ఇంత శ్రమించినా యూట్యూబ్ అల్గారిథమ్ కొంతమందికే, కొన్ని రకాల కంటెంట్‌లకే ఫేవర్ చేస్తోందని ఆరోపించింది ఆమె. "యూట్యూబ్ నాకు ఏం ఇవ్వలేదు. ఆ ప్లాట్‌ఫామ్ పక్షపాత వైఖరి అవలంబిస్తున్నట్లు అనిపిస్తోంది. ఎంత కష్టపడ్డా కొందరిని గుర్తించడం లేదు." అని ఆవేదన వ్యక్తం చేసింది.
యూట్యూబ్‌లో డబ్బులు ఎలా వస్తాయి?
యూట్యూబ్ ఆదాయం చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది.
యాడ్ రెవెన్యూ
భారత క్రియేటర్లకు యూట్యూబ్ 1000 వ్యూస్‌కు రూ.53.46 ఇస్తుంది. (ఇది సగటు రేటు మాత్రమే. చాలా అంశాలపై వ్యూస్ రేటు ఆధారపడి ఉంటుంది). ఈ లెక్కన 1 మిలియన్ (రూ.10 లక్షలు) వ్యూస్‌కు రూ.53,460 ఆదాయం వస్తుంది. అయితే ఇందులో కొన్ని కేటగిరీల్లో 1000 వ్యూస్‌కు (టెక్ రివ్యూలు - రూ.75-రూ.375, బ్యూటీ అండ్ ఫ్యాషన్- రూ.60-రూ.262.50, గేమింగ్ - రూ.37.50-రూ.300 ) ఎక్కువ డబ్బులు ఇస్తారు.
Dive into the fascinating History of Tea and discover the story behind the World's Most Expensive Tea worth 8 Crore! 😲 Don’t miss this video! Watch Now. pic.twitter.com/K4Xlw4NZLx
— Nalini Unagar (@NalinisKitchen) September 2, 2024
ఆడియెన్స్ డెమొగ్రాఫిక్స్
భారత క్రియెటర్ల వీడియోలకు అమెరికా, యూకే వంటి దేశాల నుంచి వచ్చిన వ్యూస్‌కు అధిక ఆదాయం వస్తుంది.
ఎంగేజ్మెంట్
లైక్స్, కామెంట్స్, షేర్స్ ఎక్కువగా ఉంటే ఆ వీడియోపై ఎక్కువ డబ్బులు వస్తాయి. అంతేకాకుండా, అఫిలియేట్ మార్కెటింగ్, స్పాన్సర్డ్ కంటెంట్, మెర్చండైజ్ సేల్స్, ఛానల్ మెంబర్‌షిప్‌ల వల్ల అదనపు ఆదాయం వస్తుంది. భారత్‌లో భువన్ భామ్, అమిత్ భడనా లాంటి క్రియేటర్లు నెలకు రూ.11 లక్షల నుంచి రూ.1.7 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. అంతేకాకుండా, భారత్‌లో సగటు యూట్యూబర్ ఏడాదికి రూ.4.17 లక్షలు ఆదాయం పొందుతున్నారు.
ఖర్చు తక్కువే!
యూట్యూబ్ క్రియెటర్లుగా కావాలంటే ఓ మంచి కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్, బేసిక్ ఎడిటింగ్ టూల్స్ ఉండాలి. దీనికి రూ.15 వేల నుంచి రూ.20 వేలకు ఖర్చు అవుతుంది. ఇక ప్రొఫెషనల్ సెటప్ కావాలంటే, రూ.50 వేల నుంచి కొన్ని రూ.లక్షల వరకు ఖర్చు అవుతుంది.
అదనపు ఖర్చులు
మార్కెటింగ్, ప్రొమోషన్స్ ఖర్చులు ప్రతి యూట్యూబర్‌కు ఉంటాయి. ఇక కొన్ని రకాల కంటెంట్లకు ప్రాపర్టీలు అవసరం అవుతాయి. ట్రావెల్ వ్లాగింగ్ వంటి ఛానళ్లకు ప్రయాణ ఖర్చులు ఉంటాయి.
Have you tried my spicy ULTA Vada Pav recipe? Trust me, it's even better than the regular Vada Pav! 🌶️🔥 pic.twitter.com/i6ybbmBtHW
— Nalini Unagar (@NalinisKitchen) July 24, 2024
సవాళ్లివే!
యూట్యూబ్‌లో డబ్బులు వస్తాయి అనే గ్యారంటీ లేదు. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌లో జాయిన్ కావాలంటే క్రియేటర్లకు 1000 సబ్స్క్రైబర్లు, 4000 వాచ్ అవర్స్ కచ్చితంగా ఉండాలి. అయితే, తక్కువ వ్యూస్, ఎంగేజింగ్‌గా లేని కంటెంట్, తక్కువ యాడ్ రేట్లు ఆదాయానికి గండి కొడతాయి.
'మీరు నిద్ర లేవక ముందే మీ షాపు మూతబడుతుంది'-- అంచనా వేయలేని యూట్యూబ్ అల్గారిథమ్‌లను ఉద్దేశించి నళిని చెప్పిన మాటలివి. కేవలం యూట్యూబ్‌పైనే ఆధారపడితే ఎలాంటి రిస్క్‌లు ఉంటాయే నళిని ఉనాగర్ అనుభవం మనతు తెలియజేస్తోంది.
'పక్షపాత వైఖరి' ఎలా అధిగమించాలి?
యూట్యూబ్ ద్వారా మంచి ఆదాయం పొందాలంటే మంచి క్వాలిటీ కంటెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. సమయానికి తగ్గట్లు యూజర్లకు అవసరమయ్యే ఎంగేజింగ్ కంటెంట్ అందించాలి. వీడియోలకు మంచి శీర్షికలు, కంటెంట్‌ను తెలియజేసే కచ్చితమైన థంబ్నెయిళ్లు ఉండాలి. అంతేకాకుండా కీవర్డ్లు, డిస్క్రిప్షన్లు, సరైన హ్యాష్‌ట్యాగ్‌లు వంటి ఆప్టిమైజ్డ్ మెటాడేటా ఉంటే వీడియో సెర్చబిలిటీ, రికమండేషన్లు పెరుగుతాయి. ప్రశ్నలు అడగటం, యూజర్ల కామెంట్లకు సమాధానం చెప్పడం, కార్డ్‌లు, ఎండ్ స్క్రీన్లు వంటి ఉపయోగించడం వ్యూయర్షిప్ ఎంగేజ్మెంట్కు కీలకం.
యూట్యూబ్ షార్ట్స్వంటి వివిధ కంటెంట్ టైప్స్ ఉపయోగిస్తే వ్యూయర్స్‌కు, యూట్యూబ్ అల్గారిథమ్‌లకు అనుగుణంగా ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా వీడియోలు అప్లోడ్ చేయడం కూడా కీలకమే. ఎక్కువ మంది ఆడియెన్స్‌కు చేరువయ్యేలా కొలాబరేషన్స్, సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి. ఇక యూట్యూబ్ అనలటిక్స్ లెక్కలు ప్రకారం ప్రేక్షకుల బిహేవియర్‌ను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ కంటెంట్లు, షెడ్యూళ్లు వంటి వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి.