Weekly Horoscope From January 19th To January 25th 2025 : జనవరి 19వ తేదీ నుంచి జనవరి 25వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మరికొంతకాలం వేచి చూస్తే మంచిది. వ్యాపార విస్తరణకు సమయం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని లాభాలు ఉంటాయి. అమ్మకాలు, కొనుగోళ్లు జోరందుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఆర్థిలాభాలు ఉండవచ్చు. స్వస్థానప్రాప్తి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు పట్టుదలతో చదివితే విజయం చేకూరుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలకమైన పురోగతి ఉంటుంది. ఊహించని విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉన్నత పదవులను చేపడతారు. ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ ఛాన్సులు ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఓ శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటి మరమ్మతుల కోసం ధనవ్యయం ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం ఆనందకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగస్థులు సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం కొత్త ఆనందాన్ని ఇస్తుంది. అపార్ధాలు తొలగిపోతాయి. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అనువైన సమయం నడుస్తోంది. వ్యాపారం ప్రోత్సాహకారంగా ఉంటుంది. పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంపద వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. చాలా కాలంగా వాయిదా పడిన పనులు అనుకోకుండా ముందుకు సాగుతాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పారాయణ శుభకరం.
కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్ట్‌లో పని చేసే అవకాశం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అంకిత భావంతో పనిచేయడం అవసరం. భాగస్వామ్య వ్యాపారంలో సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో లాభాన్ని పొందడమే కాకుండా వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ప్రేమ వ్యవహారాలలో, వైవాహిక జీవితంలో సమస్యలు తొలగి ఆనందం నెలకొంటుంది. విద్యార్థులు ఆశించిన విజయాలను అందుకుంటారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు పయనమయ్యేవారు శుభవార్తలు అందుకుంటారు. బంధు మిత్రుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా శుభవార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు ఉండడంతో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఇది మీ బంధాన్ని పటిష్టం చేస్తుంది. వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అవసరం. ఉద్యోగంలో పెను మార్పులు వస్తాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. పదోన్నతులు పొందుతారు. వ్యాపారులు దూరదేశాల వారితో పరిచయాలు పెంచుకొని వ్యాపారాన్ని విస్తరిస్తారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆరోగ్య కరమైన జీవనశైలితో అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ఉత్తమం.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వ్యాపారస్థులు వ్యాపారాన్ని విస్తరించడంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉపాధి లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య కొనసాగుతున్న విభేదాలు ముగుస్తాయి. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత పెట్టాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.
తుల (Libra) : తులరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన పనుల్లో గణనీయమైన విజయాన్ని సొంతం చేసుకుంటారు. వృత్తి వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కెరీర్ విజయపథంలో దూసుపోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, కోరుకున్న స్థానానికి బదిలీ పొందే అవకాశం ఉంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ విషయాలలో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇస్తే కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కొన్ని ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో పోటీ తత్త్వం పెరుగుతుంది. ఆశించిన విజయాల కోసం అదనపు కృషి అవసరం. ఇతరుల విషయంలో అవసరానికి మించి జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేస్తే మంచిది. అవకాశవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఒత్తిడికి లోనవుతారు. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక అంశాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పకుండా పాటించాలి. ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ అవసరం. మెరుగైన ప్రయోజనాల కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఉత్తమం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. పని పట్ల సోమరితనం, నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్రంగా నష్టపోతారు. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా ఏ పనిపై దృష్టి సారించలేకపోతారు. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్థిక సంబంధిత విషయాలలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. చట్టపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు ఉండవచ్చు. కుటుంబ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. సోమరితనం, నిర్లక్ష్యం భారీ నష్టాలను కలిగిస్తుంది. కొన్ని పొరపాట్ల కారణంగా వృత్తి వ్యాపారాలలో తీవ్ర నష్టాలు చోటు చేసుకుంటాయి. స్నేహితుల సహకారంతో నష్ట నివారణ చర్యలు చేపడతారు. ఆర్థిక పరంగా వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే మంచిది. ఉద్యోగులు కార్యాలయంలో పని పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థి సంక్షోభాన్ని అధిగమించడానికి, రుణవిముక్తికి అదనపు రాబడి కోసం ప్రయత్నాలు చేస్తారు. బంధు వర్గం నుంచి అందిన ఓ వార్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందాలంటే తీవ్రమైన కృషి అవసరం. నవగ్రహాల ఆలయ సందర్శనతో ఆపదలు తొలగిపోతాయి.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆచి తూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు ముందడుగు వేయవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. లేకపోతే ఆర్థి ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఎవరితోనూ వాదనలు చేయవద్దు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో డాకుమెంట్స్ పూర్తిగా పరిశీలించిన తరువాతే ముందడుగు వేయండి. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. దేనికి తొందరపడకుండా ప్రశాంతంగా, ఏకా గ్రతతో ఉండటం ముఖ్యం. సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటే లక్ష్యాలను సాధించడం సులభమవుతుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్థులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఓ శుభవార్త మీలో ఉత్తేజాన్ని నింపుతుంది. వారం చివరిలో విద్యార్థులు గణనీయమైన అభివృద్ధిని సాధిస్తారు. కోరుకున్న చోట చదువుకునే అవకాశం లభిస్తుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ప్రశాంతతను కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.