కాలిఫోర్నియాలో భారీ అగ్ని ప్రమాదం - కాలిఫోర్నియా అగ్ని ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 27, 2021, 2:46 PM IST

అమెరికాలోని కాలిఫోర్నియాలోని లాస్​ఏంజలిస్​ సమీపంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాంప్టన్​లోని పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పరిశ్రమలలో వినియోగించే చెక్క బల్లలు సహా సమీపంలో నిలిపివేసిన బస్సులు దహనం అయ్యాయి. తెల్లవారుజామున 4.45 గంటలకు ఈ అగ్నిప్రమాదాన్ని గుర్తించిన అధికారులు.. అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. 100 మంది అగ్నిమాపక సిబ్బంది 26 ఫైర్​ ఇంజిన్​ల సాయంతో మూడు గంటల పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.