ఏథెన్స్‌ను కప్పేసిన మంచు దుప్పటి - మంచు దృశ్యాలు
🎬 Watch Now: Feature Video
శీతాకాలం ప్రారంభమైన వేళ గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఏటా దేశంలోని ఉత్తర, పర్వత ప్రాంతాల్లోనే అధికంగా మంచు కురుస్తుంది. ఈ ఏడాది మాత్రం రాజధాని ప్రాంతంలోనూ భారీ హిమపాతం నమోదవుతోంది. మంచు కారణంగా జనజీవనం స్తంభించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు.. ప్రజలకు సూచించారు. కరోనా వ్యాక్సినేషన్‌ను మంగళవారం నిలిపివేశారు. మంచు ప్రభావంతో దేశంలోని పలు ప్రధాన రహదారులను సైతం మూసివేశారు. డ్రోన్ కెమెరాతో తీసిన మంచు దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. పాదచారులు, స్థానికులు మంచులో ఆనందంగా గడిపారు.