లేడీ పోలీస్ సాహసంతో తప్పిన రైలు ప్రమాదం! - police saved man on train road in califorina
🎬 Watch Now: Feature Video
కాలిఫోర్నియా, లోడీకి చెందిన 66 ఏళ్ల వృద్ధుడు, నడవలేని స్థితిలో వీల్ చైర్ మీద పట్టాలు దాటుతున్నాడు. అంతలో వీల్ చైర్ పట్టాల మధ్య ఇరుక్కుపోయింది. ఓ వైపు నుంచి రైలు దూసుకొస్తోంది. క్షణాల్లో రైలు.. దగ్గరికి వచ్చేస్తోందనగా.. వీల్ చైర్ మీద నుంచి ఆ వృద్ధుడిని కిందకి తోసేసింది అక్కడికి పరుగుపరుగున వచ్చిన ఓ పోలీసు అధికారిణి. ప్రాణాలకు తెగించి వృద్ధుడిని కాపాడిన దృశ్యాలు ఆ పోలీసు అధికారిణి బాడీ కెమెరాలో రికార్డయ్యాయి.