ప్రేయసికి అలా ప్రపోజ్ చేసి.. మనసు గెలిచి - క్యాడెట్ ప్రపోజ్
🎬 Watch Now: Feature Video
సాధారణంగా.. స్టేడియాలు, సినిమా హాళ్లు, మాళ్లు, రెస్టారెంట్లలో.. ప్రేయసికి ప్రియుడు 'ప్రపోజ్' చేయడం తరచూ చూస్తునే ఉంటాము. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఎన్నో ఉంటాయి. కానీ ఫ్రాన్స్‌కు చెందిన మ్యాక్సిమిలియన్ అనే జవాను.. తన ప్రేయసికి వినూత్న రీతిలో ప్రపోజ్ చేశాడు. ఇందుకు ఫ్రాన్స్ జాతీయ దినోత్సవమైన 'బాస్టిల్లె డే' వేదికైంది. పారిస్‌లోని ఛాంప్స్ అలీసీ ప్రాంతంలో సైనిక కవాతుకు క్యాడెట్లు సన్నద్ధమవుతుండగా.. ఆ బృందంలో ఒకడైన మ్యాక్సిమిలియన్.. ప్రేయసి వద్దకు వెళ్లాడు. మోకాలిపై కూర్చుని, అందరూ చూస్తుండగా ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఇందుకు ఆమె ఒప్పుకోగా.. మ్యాక్సిమిలియన్ ఆనందంతో ప్రేయసి చేతికి రింగు తొడిగాడు. ఈ దృశ్యాలు చూసిన ఇతర క్యాడెట్లు, స్థానికులు.. చప్పట్లు కొడుతూ శుభాకాంక్షలు తెలిపారు.