ఆస్ట్రేలియాలో అంబరాన్నంటిన న్యూ ఇయర్ సంబరాలు - abroad new year celebrations
🎬 Watch Now: Feature Video
ఆస్ట్రేలియాలో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ప్రపంచ ప్రఖ్యాత సిడ్నీ హార్బర్‌కు లక్షలాది మంది చేరుకుని నూతన ఏడాదిని ఘనంగా ఆహ్వానించారు. రంగురంగుల బాణాసంచా వెలుగులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రజలంతా కేరింతలతో 2020కి స్వాగతం పలికారు. ఒకరికి ఒకరు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బాణాసంచాను పెద్ద ఎత్తున కాల్చారు. దాదాపు 12 నిమిషాల పాటు బాణాసంచా వెలుగుజిలుగులు 15 లక్షల మంది ప్రేక్షకులను కనువిందు చేశాయి.