'మిస్ యూఎస్'గా నిలిచిన అస్యా బ్రాంచ్ - Asya Branch of Mississippi WAS CROWNED MISS USA
🎬 Watch Now: Feature Video
ఈసారి మిస్ యూఎస్ కిరీటాన్ని మిస్సిస్సిప్పికి చెందిన అస్యా బ్రాంచ్ సొంతం చేసుకొంది. 22 ఏళ్ల అస్యా జర్నలిజం చదువుతోంది. మిస్ అల్బామా, మిస్ కాలిఫోర్నియా, మిస్ హవాయ్, మిస్ ఇదాహో, మిస్ ఇల్లినోయిస్, మిస్ ఇండియానా, మిస్ న్యూయార్క్, మిస్ న్యూజెర్సీ, మిస్ ఓక్లామో ఆమెతో పాటు తుదిపోరుకు అర్హత సాధించారు. అయితే మిస్ మిస్సిస్సిప్పిగా గెలిచిన అస్యానే మిస్ యూఎస్ఏ కిరీటం వరించింది. మిస్ మిస్సిస్సిప్పిగా నిలిచిన తొలి నల్లజాతి యువతిగా ఇప్పటికే అస్యా రికార్డ్ సృష్టించింది. త్వరలో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో ఈమె అమెరికాకు ప్రాతినిథ్యం వహిస్తుంది.