ETV Bharat / state

ట్రైన్​లన్నీ కిక్కిరిసిపోతుంటే - ఆ ఒక్క రైలు మాత్రం ఖాళీగా - అదే కారణమా? - VISAKHA TO CHERLAPALLY TRAIN EMPTY

విశాఖ నుంచి ఖాళీగా బయలుదేరిన సికింద్రాబాద్‌ జనసాధారణ్‌ రైలు - సరైన ప్రచారం లేక రైలు వైపు కన్నెత్తి చూడని ప్రయాణికులు

Visakhapatnam Cherlapally Train Empty
Visakhapatnam Cherlapally Train Empty (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2025, 12:41 PM IST

Visakhapatnam to Cherlapally Train Empty : విశాఖపట్నం నుంచి చర్లపల్లి వచ్చే సికింద్రాబాద్‌ జన సాధారణ్‌ రైలు ఖాళీగా బయలుదేరింది. రైల్వే అధికారులు ఎలాంటి ప్రచారం చేయకపోవడం వల్ల ఇలా జరిగినట్లు సమాచారం. పావుగంట ఆలస్యంగా విశాఖపట్నం నుంచి ఉదయం 10 గంటలకు ఈ రైలు బయలుదేరింది. ఓ వైపు సంక్రాంతి పండుగ సందర్భంగా రైళ్లలో సీట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న టైంలో ఇలా జరగడం గమనార్హం.

విశాఖ నుంచి ఖాళీగా బయలుదేరిన సికింద్రాబాద్‌ జనసాధారణ్‌ రైలు
విశాఖ నుంచి ఖాళీగా బయలుదేరిన సికింద్రాబాద్‌ జనసాధారణ్‌ రైలు (ETV Bharat)

సమాచారం లేని కారణంగా సికింద్రాబాద్‌ జన సాధారణ్‌ రైలు గురించి ప్రయాణికులకు తెలియరాలేదు. దీంతో మిగతా రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుండగా, ఈ రైలు విశాఖ నుంచి ఖాళీగా బయలుదేరాల్సి వచ్చింది. రిజర్వేషన్‌ అవసరం లేకుండా సామాన్య ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ రైలు ఉన్న విషయం కూడా ప్రయాణికులకు తెలియలేదు. సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో ఎన్నో అగచాట్లు పడుతున్న విషయం తెలిసిందే. ఈ టైంలో ఇలా జరగడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికులకు గుడ్​న్యూస్​ - విశాఖపట్నం-సికింద్రాబాద్‌ వందేభారత్‌ కోచ్‌లు భారీగా పెంపు

మరో తొమ్మిది రైళ్లలో అదనపు జనరల్​ బోగీలు - ఆ రూట్లలో నడిచే ట్రైన్స్​కు ఎల్​హెచ్​బీ కోచ్​లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.