Telangana BC Study Circle Free Coaching 2025 : తెలంగాణ నిరుద్యోగ యువతీయువకులకు గుడ్న్యూస్. రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఆర్‌ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ, బ్యాంకింగ్ పరీక్షల ఫౌండేషన్ కోర్సులకు కోచింగ్ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 15 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం కానుందని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. మరి, ఈ కోచింగ్ పొందడానికి ఎవరు అర్హులు ? ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి? కోచింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12 బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. ఈ స్టడీ సర్కిల్స్ అందించే ఉచిత శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థులు, ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిళ్ల డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సూచించారు. ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు డాక్యుమెంట్లను పరిశీలించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇంటర్, డిగ్రీ మార్కుల ఆధారంగా రిజర్వేషన్ల నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని డైరెక్టర్ చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్రంలోని వివిధ బీసీ స్టడీ సర్కిళ్లలో వంద రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని వెల్లడించారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఫ్రీ కోచింగ్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అఫీషియల్ వెబ్సైట్ (www.tgbcstudycircle.cag.gov.in) లాగిన్ చేసి కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
- అయితే, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే అభ్యర్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.1,50,000గా ఉండాలి.
- అలాగే పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి ఆదాయం రూ.2,00,000 మించకూడదు.
ఆర్‌ఆర్‌బీ, ఎస్ఎస్‌సీ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, అలాగే బ్యాంకింగ్ పరీక్షలకు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద అభ్యర్థులను చాలా మంది సన్నద్ధమవుతున్నారు. అయితే, వీరిలో శిక్షణ సంస్థలకు వెళ్లలేని పేద అభ్యర్థులకు ఈ అవకాశం చాలా ఉపయోగపడుతుందని డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని కోరారు.
ఇటీవలే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఏకంగా 32,438 గ్రూప్-డి పోస్టులను భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అలాగే 2025 సంవత్సరానికి సంబంధించి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRB), ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSB)లలో చేపట్టనున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ విడుదలైంది.
నిరుద్యోగులకు అల్టర్- IBPS ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్- కచ్చితంగా తెలుసుకోవాల్సిన డేట్స్ ఇవే!
ఎగ్జామ్ టైమ్లో పుస్తకం తీయగానే నిద్ర వస్తుందా? - ఈ టిప్స్ వాడండి