కొవిడ్ నిబంధనలు మాకొద్దని రోడ్డెక్కిన వేలమంది - Australia protests
🎬 Watch Now: Feature Video
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ఆస్ట్రేలియా వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజారోగ్య నిర్వహణలో ఆరోగ్యమంత్రికి విస్తృత అధికారాలను కట్టబెట్టడం, ఓ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించే అధికారం ప్రధానమంత్రికి ఇవ్వడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. దీనిని వ్యతిరేకిస్తూ మెల్బోర్న్ నగరంలో జనం భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. వేలాదిమంది నిరసనకారులు పార్లమెంట్ భవనం ముందు తమ నిరసనను తెలియజేశారు. అయితే.. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని ప్రభుత్వం వాదిస్తోంది.