హాంగ్ కాంగ్: నిరసనకారులను చితకబాదిన గూండాలు - కర్రలు
🎬 Watch Now: Feature Video
హాంగ్ కాంగ్లో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆదివారం యుయెన్ లాంగ్ రైల్వే స్టేషన్లో భయానక ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారిపై గూండాలు కిరాతకంగా దాడి చేశారు. కర్రలు, బ్యాటలతో విరుచుకుపడి రక్తం వచ్చేలా కొట్టారు. బాధితుల అరుపులతో స్టేషన్ ప్రాంగణం దద్దరిల్లింది. కొంతమంది ఈ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ ఘటనలో 45మంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులకు సమాచారం అందించినప్పటికీ ఆలస్యంగా వచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.