కరోనా బాధితుల్లో స్ఫూర్తి కోసం ఆ డాక్టర్ ఏం చేసిందంటే! - play Italian national anthem.
🎬 Watch Now: Feature Video
ఇటలీలో కరోనా సోకిన కారణంగా లోమ్బార్ది నిర్బంధ కేంద్రంలో ఉన్న బాధితుల్లో ఉత్సాహం, స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నించింది సారా బార్బుటో అనే వైద్యురాలు. వారితో పాటు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి కూడా వినిపించేలా ఇటాలియన్ జాతీయ గీతాన్ని మైక్ ద్వారా వినిపించింది. అంతకు ముందు నిర్బంధ కేంద్రంలోని వైద్యులు, వైద్య సిబ్బంది.. మీ ఆరోగ్య గురించి ప్రతి క్షణం ఆలోచిస్తున్నారని బాధితుల్ని ఉద్దేశించి మాట్లాడారు.