Minister Ponguleti Srinivas Reddy On Bhu Bharati : దేశంలోనే అద్భుతమైన ఆర్వోఎస్ 2025 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మేధావులు, అనుభవజ్ఞులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సలహాల మేరకు భూభారతి తీసుకచ్చామన్నారు. దీనిలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా విధివిధానాలు రూపొందించే పనులో అధికారులు నిమగ్నమయ్యారన్నారు. ఈ పక్రియ పూర్తయ్యాక ఫిబ్రవరిలో భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని అన్నారు. శనివారం ఖమ్మంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పొందులేటి మాట్లాడారు. గత ప్రభుత్వం మాదిరిగా తప్పులు జరగకుండా సమర్థమైన, రైతులకు మేలుచేకూర్చే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ భూముల కబ్జాపై భూభారతి ద్వారా ఫిర్యాదు చేసే అవకాశముందని మంత్రి అన్నారు.
పార్ములా ఈ రేస్ : పార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి పొంగులేటి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారని అలా అనుకుంటే కేంద్రమే అరెస్ట్ చేయచ్చు కదా అని ప్రశ్నించారు. దీని విషయంలో ఏసీబీ విచారణ చేపట్టిన తర్వాత చర్యలు తీసుకుంటుందన్నారు. కర్ణాటకలో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తూ భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్శీయ భరోసా పథకం అమలు చేస్తామని తెలిపారు.
భూభారతి బిల్లుకు శాసనసభ ఆమోదం - రాష్ట్రంలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందన్న సీఎం