ఔరా: ఈ వాయు ప్రయాణానికి.. ప్రపంచ రికార్డు దాసోహం! - గతంలో గంటకు 32.02 మైళ్ల వేగం
🎬 Watch Now: Feature Video
జెట్ ఇంజిన్-శక్తితో నడిచే సూట్ ధరించి.. గాల్లో చక్కర్లు కొట్టాడు బ్రిటిష్‌కు చెందిన పరిశోధకుడు రిచర్డ్బ్రౌనింగ్. ఈ ప్రత్యేక దుస్తులు ధరించి గంటకు 86.05 మైళ్ల వేగంతో ప్రయాణించాడు నిజ జీవిత ఐరన్‌మ్యాన్‌గా పిలుచుకునే బ్రౌనింగ్. ఈ ఫీట్ ద్వారా 32.02 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి రెండేళ్ల కిందట తాను ఏర్పరచిన రికార్డును తానే బద్ధలు కొట్టాడు. గిన్నిస్ ప్రపంచ రికార్డుల సంస్థ ప్రతినిధులు ఆయనకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. బ్రౌనింగ్.. గ్రావిటీ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడుగా, చీఫ్ టెస్ట్ పైలట్‌గా ఉన్నాడు. ఈ సంస్థ జెట్ సూట్ల డిజైన్ల రూపకల్పన, ఉత్పత్తి చేస్తుంది.