పోటీల కోసం తాబేలుకు ఉపగ్రహ ట్రాకర్ - మైసీ తాబేలు
🎬 Watch Now: Feature Video
అమెరికా ఫ్లోరిజా కీస్ బీచ్ వద్ద అట్లాంటిక్ మహా సముద్రంలోకి ప్రవేశిస్తున్న ఈ తాబేలు పేరు మైసీ. దాని డొప్ప భాగంలో ఉపగ్రహ ట్రాకింగ్ ట్రాన్స్మిటర్ను అమర్చారు. ఓ పోటీలో భాగంగా మైసీ సహా 9 తాబేళ్లకు ట్రాన్స్మిటర్లను అమర్చి మహాసముద్రంలోకి వదిలేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఆగస్టు 1 నుంచి అక్టోబరు 31 వరకు వాటిలో ఏది ఎక్కువ దూరం ప్రయాణిస్తే దాన్ని విజేతగా ప్రకటించనున్నారు.