'యోగా డే'కు అఫ్గాన్ మహిళలంతా ఏకమైన వేళ - Afghan ladies gathered for Yoga in Kabul
🎬 Watch Now: Feature Video
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. అఫ్గానిస్థాన్‌కు చెందిన పశ్చిమ కాబుల్‌లోని పర్వత ప్రాంతాల్లో మహిళలంతా ఏకమయ్యారు. నిశ్శబ్ద వాతావరణంలో శాంతియుతంగా యోగా చేశారు. ఈ కార్యక్రమానికి యోగా బోధకులు ఫఖ్రియా మొంతాజ్ నేతృత్వం వహించారు. మహిళలు బయటకు వచ్చి తమ సమయాన్ని వినియోగించుకునేందుకు ఇదొక చక్కటి అవకాశమని ఆమె తెలిపారు. అఫ్గాన్‌లో యోగాకు అంత ప్రాముఖ్యత లేనప్పటికీ.. ఒత్తిడిని దూరం చేసేందుకు ఇదొక మంచి మార్గమని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.