'సామాజిక దూరం'పై సూపర్ మార్కెట్లో రోబో పాఠాలు - ప్రపంచదేశాలపై కరోనా ప్రభావం
🎬 Watch Now: Feature Video
కరోనా వైరస్ ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు స్వీయ నిర్బంధంతో పాటు సామాజిక దూరం అత్యంత అవసరం. జర్మనీ ఉప్పర్టాల్లోని ఓ సూపర్మార్కెట్లో దీనిపైనే అవగాహన కల్పిస్తోంది పెప్పర్ అనే రోబో. వినియోగదారులకు సామాజిక దూరంపై అవగాహన పెంపొందిస్తూ.. సులభంగా, వేగంగా షాపింగ్ చేసేలా ఇతర సలహాలూ ఇస్తోంది. ఈ ప్రయత్నాన్ని కస్టమర్లు మెచ్చుకుంటున్నారని చెబుతున్నారు సూపర్‌మార్కెట్ యజమాని. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ వారి ముఖాల్లో నవ్వులు తెప్పిస్తోందని అంటున్నారు.