20 అడుగుల పైథాన్ కలకలం.. భయాందోళనలో జనం - అడవుల్లో పైథాన్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14874253-thumbnail-3x2-python.jpg)
Huge Python Spotted: బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలో ఓ పెద్ద కొండచిలువ కనిపించింది. జనం ఉలిక్కిపడ్డారు. దాదాపు 20 నుంచి 22 అడుగులు ఉంటుందని అంచనావేస్తున్నారు. సోమవారం రాత్రి.. బగాహా వద్ద వాల్మీకి టైగర్ రిజర్వ్ ప్రాంతం వద్ద అడవి నుంచి నివాస ప్రాంతాలవైపు రోడ్డు దాటుతూ కనిపించింది. స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరలైంది. రాత్రివేళలో వన్యప్రాణులు జనావాసాల సమీపంలో సంచరిస్తుండటం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST